: అది దేవుని నిర్ణయం, అందుకే అంతమంది చనిపోయారంటున్న క్రేన్ ఇంజనీర్!
మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రేన్ కుప్పకూలి 107 మంది చనిపోవడానికి దేవుడే కారణమని వితండవాదం చేస్తున్నాడు ఓ ఇంజనీర్. దాదాపు 200 మందికి పైగా గాయపడ్డ ఘటన దేవుని నిర్ణయమని, సాంకేతిక తప్పిదం కాదంటే కాదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సౌదీ బిన్ లాడెన్ గ్రూప్ కు చెందిన ఇంజనీరు వాదిస్తున్నాడు. ఈ క్రేన్ గత మూడు నాలుగేళ్లుగా పనిచేస్తోందని, ఆ సమయంలోనే కూలడం అంటే, అది దైవనిర్ణయమని అన్నాడు. తనకు తెలిసినంత వరకూ మానవాతీత శక్తి మాత్రమే క్రేన్ ను కూల్చగలదని, మానవ తప్పిదాలు లేవని అన్నాడు. నిత్యమూ వేలాది మంది సందర్శించే ఈ ప్రాంతంలో భారీ క్రేన్లను వాడుతూ అభివృద్ధి పనులు జరపడం నిత్యమూ కష్టమని, ఎంతో నైపుణ్యంతో తాము పని చేస్తున్నామని తెలిపాడు.