: ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఈ మధ్యాహ్నం రాజమండ్రికి జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యాహ్నం రాజమండ్రి బయలుదేరి వెళుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలో జరిగిన ఘోర లారీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆసుపత్రిలో జగన్ పరామర్శిస్తారు. అంతేగాక మృతుల కుటుంబాలను కూడా ఆయన పరామర్శించి ఓదార్చనున్నారు. ఇప్పటికే ప్రమాద ఘటనపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.