: ఎమ్మెల్యే తీగల, ఆయన కుమారుడిపై భూ కబ్జా కేసు
మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కుమారుడిపై మీర్ పేట పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. తమ భూమిని కబ్జా చేసి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు బెదిరిస్తున్నారంటూ జయశ్రీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.