: గృహ నిర్బంధంలో బైరెడ్డి... కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
కర్నూలు జిల్లాలో నేటి ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని తంగడంచ మండలంలో పరిశ్రమల కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు నిరసనగా రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధినేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి నేడు తంగడంచ నుంచి కర్నూలు వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో పాలుపంచుకునేందుకు పెద్ద ఎత్తున రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు కర్నూలులోని బైరెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. యాత్రకు అనుమతివ్వని ప్రభుత్వం, శాంతిభద్రతల పేరు చెప్పి బైరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచింది. ఓ వైపు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తున్న క్రమంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.