: సానియా భేష్... టెన్నిస్ స్టార్ కు కేసీఆర్ అభినందన
యూఎస్ ఓపెన్ లో సత్తా చాటి యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. గత రాత్రి యూఎస్ ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో జరిగిన ఫైనల్ లో మార్టినా హింగిస్ తో కలిసి సానియా మీర్జా విజయం సాధించి ఒకే కేలండర్ ఇయర్ లో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను నెగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న కేసీఆర్, సానియా విజయంపై స్పందిస్తూ అభినందన సందేశం పంపారు. భవిష్యత్తులో సానియా మీర్జా మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ ఆ సందేశంలో ఆకాంక్షించారు.