: సత్తా చాటిన సానియా... హింగిస్ తో కలిసి యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం


హైదరాబాదీ టెన్నిస్ సంచలనం, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత సానియా మీర్జా మరోమారు సత్తా చాటింది. మార్టినా హింగిస్ తో కలిసి యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ బరిలోకి దిగిన సానియా ఏకంగా టైటిల్ చేజక్కించుకుంది. ఇప్పటికే హింగిస్ తో కలిసి ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ చేతబట్టిన సానియా ఒకే కేలండర్ ఇయర్ లో రెండో టైటిల్ నూ కైవసం చేసుకుంది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్ లో డెలాక్వా, యరోస్లావా జోడీపై వరుస సెట్లలో 6-3, 6-3 స్కోరుతో సానియా, హింగిస్ జోడీ విజయం సాధించింది. తాజా యూఎస్ ఓపెన్ టైటిల్ తో సానియా ఐదో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించినట్లయింది.

  • Loading...

More Telugu News