: మాంసం నిషేధానికి మద్దతిచ్చాడని గుడ్లతో కొట్టారు


మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా మాంసం నిషేధంపై వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. న్యాయస్థానం జైన మత సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని నిషేధాన్ని ఒక్కరోజుకే పరిమితం చేసింది. దీంతో ముంబైలోని ఓ జ్యుయలర్ షాపు యజమాని మాంసం నిషేధానికి మద్దతుగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. దీంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు ఆ జ్యుయలర్ షాపుపైకి కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. దీంతో సదరు వ్యాపారి పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలకు సర్దిచెప్పి శాంతింపజేశారు. కాగా, జైన్ మత సంప్రదాయానుసారం పవిత్రమైన 'పర్యుషాన్' సందర్భంగా మాంసం నిషేధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News