: మాకు నచ్చకపోతే ఎవరినైనా సరే ఓడిస్తాం: ఆనం సంచలన వ్యాఖ్యలు


ఒకడ్ని గెలిపించే శక్తి, ఓడించే శక్తి రెండూ తమకు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, తమకు వెన్నుపోటు పొడవాల్సిన అవసరం లేదని అన్నారు. తమకు ఇష్టం లేకపోతే నేరుగానే ఓడిస్తామని ఆయన తెలిపారు. గతంలో చాలా మందిని అలాగే ఓడించామని ఆయన చెప్పారు. తమకు నచ్చకపోయినా, ప్రజలకు ఉపయోగపడరని అనిపించినా, కాంగ్రెస్ పార్టీకి వీరు అవసరం లేదని భావించినా వారిని ఓడిస్తామని ఆయన తెలిపారు. ఇందులో రహస్యం ఏమీ లేదని, ఇది జగమెరిగిన సత్యమని ఆయన తెలిపారు. టి.సుబ్బరామిరెడ్డిని తాము ఓడించలేదని, అయితే ఆయన ఓడిపోతారని తమకు తెలుసని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News