: ఫీజుల పేరిట విద్యార్థులను వేధించొద్దు: కళాశాలలకు కడియం వార్నింగ్


ఫీజుల పేరిట విద్యార్థులను వేధించవద్దని ప్రైవేటు కళాశాలలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ లో నిర్వహించిన జూనియర్ కళాశాలల సంఘం రాష్ట్ర సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఇంటర్మీడియెట్ బోర్డులో అవినీతిని ప్రోత్సహించింది ప్రైవేటు కళాశాలలేనని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా ఆన్ లైన్ విధానం తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు. 2016 విద్యా సంవత్సరానికి సంబంధించిన బోధనా రుసుము ముందే చెల్లిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News