: రవిశాస్త్రి పదవీ కాలం పొడిగింపు...కొత్త కోచ్ ఇప్పట్లో లేనట్టే!


టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పదవీ కాలం మరో ఏడాది పెంచినట్టు బీసీసీఐ తెలిపింది. రవిశాస్త్రి పదవీ కాలం ముగియడంతో అతనిని మరో ఏడాదిపాటు డైరెక్టర్ గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ తాజా నిర్ణయంతో టీమిండియాకు కొత్త కోచ్ నియామకం ఇప్పట్లో లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ మధ్య మంచి అవగాహన ఉందని, కొత్త కోచ్ ను నియమిస్తే, అవగాహన లోపంతో టీమిండియా ఇబ్బందుల్లో పడే అవకాశముందని భావించిన బీసీసీఐ, రవిశాస్త్రిని మరో ఏడాది పాటు డైరెక్టర్ గా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో టీమిండియాకు కోచ్ కమ్ డైరెక్టర్ గా రవిశాస్త్రి మరో ఏడాదిపాటు కొనసాగుతారు.

  • Loading...

More Telugu News