: పారా మిలటరీ బలగాలు ఫేస్ బుక్, వాట్సప్ లను వాడొద్దు!: హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు


ముఖ్యమైన సమాచారం, ఫొటోలను షేర్ చేసుకునేందుకు సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సప్ లను వాడవద్దంటూ కేంద్ర పారామిలిటరీ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సిబ్బందిని వీటికి దూరంగా ఉండేలా చూడాలని పేర్కొంది. చత్తీస్ గఢ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని పారా మిలిటరీ బలగాల ఆపరేషనల్ బేస్ లలో యాక్టివ్ అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీలు)కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సిబ్బంది షేర్ చేసుకోవడం హోం మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే హోం మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలను జారీ చేసింది.

  • Loading...

More Telugu News