: ఏపీలో తాగు నీటి పథకాలకు వెయ్యి కోట్లు: చింతకాయల
ఆంధ్రప్రదేశ్ లోని తాగునీటి పథకాలు పూర్తి చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 782 తాగునీటి పథకాలను వచ్చే ఏప్రిల్ లోగా పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 329 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 23 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన చెప్పారు. ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామాల్లో 25 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.