: భార్య వద్దు...కూతురే ముద్దు: ఈగ ఫేమ్ సుదీప్


బార్య వద్దు...కూతురే ముద్దు అంటున్నాడు 'ఈగ' ఫేమ్ సుదీప్. కన్నడ నటుడైన సుదీప్ సినిమాల్లో నిలదొక్కుకోక ముందు కేరళకు చెందిన ప్రియతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి 11 ఏళ్ల కుమార్తె శాన్వి ఉంది. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ప్రియ భర్త సినిమాల్లో నిలదొక్కుకునేందుకు ఎంతో సహాయపడింది. 2009-10లో సుదీప్ పై పుకార్లు షికార్లు చేయనంతవరకు 15 ఏళ్ల పాటు వీరి దాంపత్యం బాగానే సాగింది. అనంతరం ఒడిదుడుకులకు గురైన వీరి దాంపత్య బంధం బెంగళూరు ఫ్యామిలీ కోర్టు అనుమతితో ముగిసింది. అయితే విడాకుల ఒప్పందం ప్రకారం భార్యకు 19 కోట్లు ఇచ్చారట నిజమేనా? అని 'కిచ్చా' సుదీప్ ను ప్రశ్నించిన మీడియాకు...'ఎవరి కోసం చేస్తున్నాను? నా భార్య, కుమార్తెల కోసమే కదా?' అంటూ సమాధానమిచ్చి షాకిచ్చాడు. అంతే కాదు, భార్య వద్దు కానీ, కుమార్తె శాన్వి తన పంచ ప్రాణాలని తెలిపాడు. శాన్వి కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని సుదీప్ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News