: ఓట్ల కోసం దేశ చరిత్రను బేరం చేసే కాలం వచ్చింది!: వెంకయ్యనాయుడు


ఓట్ల కోసం దేశ చరిత్రను బేరం చేసే కాలం వచ్చిందంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ‘ది క్రానాలజీ ఏన్షియంట్ ఇండియా’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఏ జాతి అయినా ముందుకు వెళ్లాలంటే వారసత్వ సంపద ఎంతో అవసరమన్నారు. హిందూ, ముస్లింలందరూ భారతీయులేనన్నారు. దేశ చరిత్రను కొందరు కావాలనే వక్రీకరించారన్నారు. హిందూయిజమనేది దేశ సంస్కృతికి గుర్తింపు అని, మన దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News