: గాంధీ ఆసుపత్రిలో ఘోరం...విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్ పై రోగి మృతి
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. ఆసుపత్రిలో గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో మృతుడి బంధువులు అక్కడ ఆందోళనకు దిగారు. అత్యవసర చికిత్స పొందుతున్న రోగుల విషయంలో ఆసుపత్రి అధికారులు ఈవిధంగా ప్రవర్తించడంపై మృతుడి బంధువులు మండిపడుతున్నారు. గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఆసుపత్రిలో ఎవ్వరూ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.