: తిరుమల బ్రేక్ దర్శన టికెట్ల విక్రయాల్లో గోల్ మాల్... ఎమ్మెల్యే మెడకు చుట్టుకున్న వివాదం


తిరుమల వెంకన్న దర్శనంలో బ్రేక్ దర్శనం పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందజేస్తున్న టికెట్ల విక్రయాల్లో గోల్ మాల్ చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధి సిఫారసుతో బ్రేక్ దర్శనం టికెట్లను చేజిక్కించుకున్న అవినాశ్, నిరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు వాటిని బ్లాక్ లో విక్రయిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో నిందితుల వద్ద రూ.70 వేల లంచాన్ని డిమాండ్ చేసిన తిరుపతికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సూర్యచంద్రరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా... ఈ వ్యవహారంలో తిరుపతి ఎమ్మెల్యే, దివంగత నేత వెంకటరమణ సతీమణి సుగుణకూ పాత్ర ఉన్నట్లు తేలింది. తిరుపతి ఎమ్మెల్యే హోదాలో సుగుణ చేసిన సిఫారసు ఆధారంగానే నిందితులిద్దరూ బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ అధికారుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే సిఫారసు లేఖలు బయటపడటంతో పోలీసులు సందిగ్ధంలో పడిపోయారు.

  • Loading...

More Telugu News