: ఏపీలో మరో కంపెనీ లాకౌట్... కొత్తవలస యూనిట్ ను మూసేసిన జిందాల్ స్టీల్


ఏపీలో కంపెనీల లాకౌట్లు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి పెను సవాళ్లు విసురుతున్నాయి. ఇప్పటికే నవ్యాంధ్ర రాజధానికి కేంద్రంగా మారుతున్న గుంటూరు జిల్లాలో భజరంగ్ జూట్ మిల్లు వివాదం ప్రభుత్వాన్ని సంకట స్థితిలోకి నెట్టేసింది. జూట్ మిల్లు మూతతో రోడ్డున పడ్డ కార్మికులు రోజుల తరబడి ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన ప్రభుత్వం సమస్యను పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తోంది. ఈ సమస్య ఇంకా పరిష్కారం కాకుండానే దేశంలోనే ఉక్కు రంగంలో అగ్రగామిగా పేరున్న జిందాల్ స్టీల్ ఏపీ సర్కారుకు షాకిచ్చింది. విజయనగరం జిల్లా కొత్తవలసలోని తన ప్లాంటును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ లాకౌట్ వల్ల దాదాపు 550 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.

  • Loading...

More Telugu News