: తిరుమలలో లడ్డూల లొల్లి... కోటా తగ్గింపుపై భక్తుల మండిపాటు


తిరుమల వెంకన్న సన్నిధిలో నేటి ఉదయం లడ్డూల లొల్లి మొదలైంది. ముందస్తు సమాచారం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు అందించే లడ్డూల సంఖ్యను కుదించింది. దీనిపై సమాచారం లేని వెంకన్న భక్తులు తక్కువ సంఖ్యలో ఇస్తున్న లడ్డూలపై అక్కడి సిబ్బందిని నిలదీశారు. లడ్డూల కోటా తగ్గిందని చెప్పిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా లడ్డూల కోటాను ఎలా తగ్గిస్తారని భక్తులు మండిపడ్డారు. దీంతో లడ్డూ కౌంటర్ల వద్ద గందరగోళం నెలకొంది. త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు తగినంత మేర లడ్డూలను సరఫరా చేసేందుకే ప్రస్తుతం కోటా తగ్గించామని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News