: తాపేశ్వరంలో ‘ఖైరతాబాద్’ గణనాథుడి లడ్డూ తయారీ ప్రారంభం


తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ఊపందుకోనున్నాయి. ఈ నెల 17న దేశవ్యాప్తంగా వినాయకుడి విగ్రహాలు వాడవాడలా కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాదులోని ఖైరతాబాదు, విశాఖ తదితర ప్రాంతాల్లో భారీ గణనాథుల విగ్రహాల తయారీ చివరి దశకు చేరుకుంది. తెలంగాణలోని ఖైరతాబాదు వినాయకుడి చేతిలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో తయారైన లడ్డూను పెట్టడం ఆనవాయతీగా వస్తోంది. సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు గణపతి మాల ధరించి స్వయంగా లడ్డూ తయారీలో పాల్గొంటారు. ఈ ఏడాదికి సంబంధించిన లడ్డూ తయారీని నిన్న మల్లిబాబు ప్రారంభించారు. మరో 15 మంది సిబ్బందితో కలిసి ఆయన నిన్న లడ్డూకు వినియోగించే బూందీ తయారీని ప్రారంభించారు. 5,600 కిలోల బరువుండే ఈ లడ్డూ తయారీ కోసం మల్లిబాబు అత్యాధునిక థర్మల్ హీటింగ్ వంటశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ తరహా వంటశాల ఉమ్మడి రాష్ట్రాల్లో ఇదే తొలిదని చెప్పిన ఆయన, గణనాథుడి లడ్డూ తయారీకి మరిన్ని అత్యాధునిక వంట పాత్రలను వినియోగించనున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News