: కష్టాల్లో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పుత్రరత్నం...అంబులెన్స్ అక్రమాలపై ఈడీ కేసు నమోదు


కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మరిన్ని కష్టాలను ఎదుర్కోనున్నారు. రాజస్థాన్ లో అంబులెన్స్ సర్వీసులను నడిపిన కార్తీ ప్రభుత్వం నుంచి అదనపు సొమ్మును వసూలు చేశారన్న ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కార్తీ చిదంబరంతో పాటు, మరో కేంద్ర మాజీ మంత్రి వయాలర్ రవి కుమారుడు కృష్ణ, రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్, రాజస్థాన్ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి దురా మీర్జాలపైనా సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసుపై తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. రాజస్థాన్ లో 2010 దాకా అంబులెన్స్ సర్వీసులను ఈఎంఆర్ఐ నిర్వహించగా, ఆ తర్వాత చికిత్సా హెల్త్ కేర్ పేరిట రంగప్రవేశం చేసిన కార్తీ చిదంబరం సంస్థ ఆ కాంట్రాక్టును దక్కించుకుంది.

  • Loading...

More Telugu News