: అత్యాచారం చేశాడు... కేసు పెట్టిందని కాల్చేశాడు


ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముహ్మదాపూర్ కు చెందిన ఓ మహిళపై గతేడాది ప్రదీప్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు మహిళ అతనిపై కేసు పెట్టింది. పోలీసులు అతనిని అరెస్టు చేయగా, న్యాయస్థానం అతనిని జైలుకి పంపింది. కాగా, రెండు నెలలక్రితం బెయిల్ పై విడుదలైన ప్రదీప్ వస్తూనే కేసు వాపస్ తీసుకోవాలంటూ ఆమెను బెదిరించాడు. ఆమె అంగీకరించకపోవడంతో కక్ష గట్టిన ప్రదీప్, ఆమె తన భర్తతో కలిసి వెళ్తుండగా తుపాకీతో కాల్చి చంపి పరారయ్యాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News