: విశాఖ మెట్రో రైల్ కి 12,727 కోట్లు...విజయవాడ మెట్రో రైల్ కి 6,769 కోట్లు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన మెట్రో రైల్ నిర్మాణ వ్యయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పీఎన్ బీఎస్ నుంచి పెనమలూరు కారిడార్ వరకు అంటే 26.03 కిలోమీటర్ల దూరం వరకు విజయవాడ మెట్రో రైల్ ను నిర్మించనున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 6,769 కోట్ల రూపాయలు వ్యయం కానుందని ఆయన చెప్పారు. అలాగే స్మార్ట్ సిటీ విశాఖపట్టణంలో నిర్మించనున్న మెట్రోరైల్ ప్రాజెక్టుకు 12,727 కోట్ల రూపాయలు వ్యయం కానుందని ఆయన వెల్లడించారు. నేటి ఉదయం మెట్రోరైల్ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ సీఎం చంద్రబాబును కలిసి సమగ్ర నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.