: లాకప్ డెత్ విషయం నాకు తెలియదే!:ఆంధ్రా డీజీపీ


గుప్తనిధుల తవ్వకాల కేసు విచారణలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్రీరాములు(54) లాకప్ డెత్ విషయం గురించి తనకు తెలియదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అన్నారు. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీలో ఈ రోజు జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన వెళ్లారు. సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం లాకప్ డెత్ విషయమై డీజీపిీని విలేకరులు ప్రశ్నించారు. 'లాకప్ డెత్ గురించి తెలియదే!' అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో నివ్వెరపోవడం విలేకరుల వంతయింది. అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లిలో శ్రీరాములును పోలీసులు నిన్న అదుపులోకి తీసుకోగా, లాకప్ లో చనిపోయాడంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News