: ఐఎస్ఐఎస్ పట్ల ప్రపంచ దేశాలకు అమెరికా హెచ్చరిక


ఐఎస్ఐఎస్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఐఎస్ఐఎస్ రసాయన ఆయుధాలు ప్రయోగిస్తోందని ఈ సందర్భంగా అమెరికా వెల్లడించింది. ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాలు, రసాయన బాంబులు ప్రయోగించినట్టు ఇటీవలి ఘటనల్లో రుజువైందని అమెరికా తెలిపింది. సిరియా, ఇరాక్ దేశాల్లో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా వందలాది మంది మృత్యువాతపడగా, లక్షలాది మంది దేశం విడిచిపారిపోతున్నారు. అమెరికా తాజా హెచ్చరికలు పలుదేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

  • Loading...

More Telugu News