: సహచరుడి అవినీతితో ఈజిప్టు ప్రధాని రాజీనామా


సహచరుడి అవినీతి నిర్వాకానికి ఈజిప్టు ప్రధాని రాజీనామా చేశారు. ఈజిప్టు ప్రధాని ఇబ్రహీం మలహబ్ మంత్రి వర్గంలోని వ్యవసాయ శాఖామంత్రి అవినీతి బయటపడడంతో గతనెల అరెస్టయ్యారు. దీంతో కేబినెట్ సహచరులతో పాటు ప్రధాని కూడా రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసికి అందజేశారు. వీటిని పరిశీలించిన అధ్యక్షుడు వారి రాజీనామాలను ఆమోదించారు. అయితే తదుపరి ప్రధాని ఎన్నికయ్యేవరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని ఇబ్రహీం మలహబ్ ను అధ్యక్షుడు కోరారు. దీనికి ఆయన అంగీకరించారు. కాగా, ఈజిప్టులో అక్టోబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News