: అన్నా హజారే నిరాహార దీక్ష ఇక లేదు!


సామాజిక ఉద్యమకారుడు, గాంధేయవాది అన్నాహజారే నిరాహార దీక్ష ఆలోచనను విరమించుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గాంధీ జయంతి రోజున అంటే అక్టోబర్ 2న 'ఒకే ర్యాంకు ఒకే పింఛను' పథకం, భూ సేకరణ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటనను రైతులు, మాజీ సైనికులు, సామాజిక ఉద్యమకారులు స్వాగతించారు. ఆయనకు మద్దతుగా వస్తామని పేర్కొన్నారు. ఈలోగా మాజీ సైనికులు ఆందోళనకు దిగడంతో దిగివచ్చిన కేంద్రం 'ఒన్ ర్యాంక్ ఒన్ పింఛన్' అమలు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో పునరాలోచనలో పడిన ఆయన నిరాహార దీక్ష విరమించుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News