: మలయాళ సినీ నటుడికి గాయాలు...కొచ్చి ఆసుపత్రిలో చికిత్స


మలయాళ సినీ నటుడు, దర్శకుడు సిద్ధార్థ్ భరతన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నేటి తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారు చంబక్కర వద్ద రోడ్డు పక్కనున్న గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సిద్ధార్థ్ భరతన్ కు తీవ్ర గాయాలు కావడంతో కొచ్చి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రముఖ మలయాళ దర్శకుడు భరతన్, నటి కె.పి.ఎ.సి.లలిత కుమారుడే సిద్ధార్థ్. దీంతో మలయాళ సినీ పరిశ్రమ మొత్తం ఆసుపత్రికి క్యూ కడుతోంది. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, హోం మంత్రి రమేష్ చెన్నితాల ఆసుపత్రికి ఫోన్ చేసి సిద్ధార్థ్ ఆరోగ్యపరిస్థితిపై ఆరాతీశారు.

  • Loading...

More Telugu News