: హర్భజన్ వివాహం వాయిదా?


ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం వాయిదా పడిందా? అంటే అవుననే అంటున్నారు భజ్జీ సన్నిహితులు. అక్టోబర్ 29న క్రికెటర్ హర్భజన్ సింగ్, సినీ నటి గీతా బాస్రా వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారని వార్తలు వెలువడ్డాయి. గీతా బాస్రా కూడా తొందర్లోనే ఆ ముచ్చట తీరుతుందంటూ పేర్కొంది. దీంతో వీరి వివాహం వచ్చే నెల జరగనుందంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఆ జంట వివాహం ఇప్పట్లో లేదని భజ్జీ సన్నిహితుడు ఒకరు చెప్పారు. భజ్జీ, బాస్రా వివాహ తేదీని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించలేదని స్పష్టం చేశారు. నవంబర్ 2న హర్భజన్ కు క్రికెట్ షెడ్యూల్ ఉందని అందువల్ల వివాహం డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఉండవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News