: భూములిచ్చే సమస్యే లేదని ఏపీ సర్కారుకు తేల్చి చెప్పిన బందరు రైతులు


తమ తాతల కాలం నుంచి జీవనోపాధిగా ఉంటున్న భూములను నౌకాశ్రయం నిర్మాణం పేరిట లాక్కోవాలని చూస్తే సహించబోమని, భూములను ప్రభుత్వానికి అప్పగించే సమస్యే లేదని బందరు ప్రాంత రైతులు ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. పోర్టు నిర్మాణానికి రైతులను ఒప్పించేందుకు మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ సహా అధికారులు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ ఘటన జరిగింది. పోర్టుకు భూములను తీసుకోవద్దని తపసుపూడి, మంగినపూడి గ్రామాల రైతులు ముక్తకంఠంతో కోరారు. రాష్ట్ర అభివృద్ధి నిమిత్తం భూములను అడుగుతున్నామని, భూమి ఇచ్చిన ఏ రైతుకూ అన్యాయం జరగనివ్వబోమని ఈ సందర్భంగా రవీంద్ర రైతులకు అభయం ఇచ్చారు. రైతుల సమస్యలు, అనుమానాలు చెబితే, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గాలతో వస్తానని చెప్పారు. రైతులు సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News