: ప్రియుడి కారణంగానే సెరెనా వైఫల్యం... నిప్పులు చెరుగుతున్న ఫ్యాన్స్!
అత్యంత అరుదైన 'గ్రాండ్ స్లామ్' కలలను సెరెనా విలియమ్స్ చేజార్చుకున్న తరువాత ఆమె అభిమానులు సెరెనా ప్రియుడు 'డ్రేక్'పై నిప్పులు చెరుగుతున్నారు. డ్రేక్ కారణంగానే తమ అభిమాన క్రీడాకారిణి ఓటమి పాలయిందని మండిపడుతున్నారు. వారి కోపాన్ని, కసిని సామాజిక మాధ్యమాల ద్వారా తీర్చుకుంటున్నారు. 'ఓ డ్రేక్! నువ్వు మ్యాచ్ కి వచ్చి ఎంత పనిచేశావు?' అని ఒకరంటే, 'డ్రేక్! మరో నెల రోజుల పాటు బయట కనిపించావో... ఇక అంతే!' అంటూ ఇంకొకరు, 'డ్రేక్ ప్రేక్షకుల్లో ఉంటే జరిగే నష్టం మరోసారి తెలిసొచ్చింది' అని మరొకరు వ్యాఖ్యానించారు. యూఎస్ ఓపెన్ పోటీల్లో సెమీఫైనల్ వరకూ తిరుగులేని ఆధిపత్యం చూపుతూ వచ్చిన సెరెనాను ఓ అన్ సీడెడ్ ప్లేయర్ ఓడించిన సంగతి తెలిసిందే.