: నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ : వీహెచ్


రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. నియంత పాలనకు త్వరలో చరమగీతం పాడతామని అన్నారు. ఈ ఉదయం ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి కొట్టొచ్చినట్లు కనపడుతోందన్నారు. రైతు కుటుంబాలను నిర్లక్ష్యం చేయడమంటే వారిని అవమానించి నట్లేనంటూ టీ సర్కార్ పై హనుమంతరావు మండిపడ్డారు. కాగా, ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News