: తెదేపా ఎమ్మెల్యేకు మలేషియా లో ప్రమాదం
తెలుగుదేశం పార్టీ నేత, తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు ప్రయాణిస్తున్న కారు మలేషియాలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కాగా, 12 కుట్లు పడ్డాయి. ఐదు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, కొందరు ఎమ్మెల్యేలు కలసి సింగపూర్, మలేషియాల పర్యటన నిమిత్తం వెళ్లారు. రోడ్డుపై వేగంగా వెళుతున్న కారుకు ప్రమాదం జరిగింది. విషయం బయటకు చెబితే, నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతారన్న ఉద్దేశంతో, సంఘటనను దాచిపెట్టారు. స్వదేశానికి వచ్చిన తరువాత మాత్రమే కారు ప్రమాదం విషయం అందరికీ తెలిసింది. పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన్ను పరామర్శించారు.