: భువిపై అత్యంత ఆకర్షణీయుడు ఇతడే!


ప్రపంచంలో అత్యంత సౌందర్య రాశి ఎవరన్న విషయమై ప్రతి సంవత్సరమూ దాదాపు అన్ని దేశాల్లో పోటీలు, ఆపై మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. మరి అత్యంత ఆకర్షణీయ పురుషుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం 'ఆటిట్యూడ్' తన రీడర్లను అడిగింది. దీనికి హాలీవుడ్ నటుడు, 'వన్ డైరెక్షన్' స్టార్ లియామ్ పేనీ అని సమాధానం వచ్చింది. "హూ ఈజ్ ది సెక్సీయస్ట్ మ్యాన్?" అని ప్రశ్నించగా, అత్యధికులు లియామ్ కు ఓటేశారు. "నమ్మలేకపోతున్నాను. ఈ ఘనత నాకు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. ఎంతో గర్వంగా ఉంది" అని ఫలితాలు వెల్లడైన తరువాత లియామ్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News