: చొరబాట్లు ఉండబోవన్న హామీ నేనెలా ఇస్తా?: రాజ్ నాథ్ కు పాక్ రేంజర్ల చీఫ్ ప్రశ్న
ఇండియాతో శాంతి చర్చలకు వచ్చినా, పాకిస్థాన్ బుద్ధి మారలేదు. పాక్ రేంజర్లు, బీఎస్ఎఫ్ మధ్య న్యూఢిల్లో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇండియాలోకి ఎటువంటి చొరబాట్లు ఉండవన్న హామీని ఇవ్వాలని, పాక్ రేంజర్ల చీఫ్ బర్కీని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. దీనిపై స్పందిస్తూ, తాను పాక్ సరిహద్దు రేంజర్లకు మాత్రమే చీఫ్ నని, పాక్ ప్రభుత్వానికి కాదని వ్యాఖ్యానించి తమ బుద్ధి మారలేదని మరోసారి స్పష్టం చేశాడు. రాజ్ నాథ్ వినతిపై తాను ఎటువంటి హామీని ఇవ్వలేనని తేల్చేశాడు. ఆ హామీని తానెలా ఇవ్వగలనని ఎదురు ప్రశ్నించాడు. కాగా, పాకిస్థాన్ పై ఎన్నడూ తాము తొలి బులెట్ ను పేల్చబోమని రాజ్ నాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.