: తెలంగాణలో భూలోక స్వర్గం!


ప్రపంచంలోనే భూలోక స్వర్గాలుగా పేరు గాంచిన అతికొన్ని నగరాల్లో ఒకటైన 'సుజు' తరహాలో తెలంగాణ రాష్ట్రంలో ఓ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. చైనా పర్యటనలో భాగంగా షాంఘై నుంచి బీజింగ్ కు బయలుదేరే ముందు కేసీఆర్ బృందం సుజు పారిశ్రామిక నగరాన్ని సందర్శించింది. అనంతరం 'చైనా-సింగపూర్ సుజు ఇండస్ట్రియల్ సిటీ' కమిటీ సభ్యులు యూకే జైన్ తో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగరాన్ని ఎలా నిర్మించారు, ఆపై ఏ విధమైన అభివృద్ధి పనులను చేపట్టారన్న విషయాలను తెలంగాణ టీమ్ కు ఆయన వివరించారు. సుజులో 7 లక్షల మందికిపైగా పని చేస్తున్నారని తెలుసుకున్న కేసీఆర్ ఆశ్చర్యపోయారు. తాము తెలంగాణలో ఇదే తరహా నగరాన్ని నిర్మిస్తామని, దానికి సహకరించాలని కేసీఆర్ కోరారు. కాగా, మొత్తం 288 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన సుజు పారిశ్రామికవాడలో వందలాది కంపెనీలున్నాయి.

  • Loading...

More Telugu News