: పట్టాలు తప్పిన మరో ఎక్స్ ప్రెస్... ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారతీయ రైల్వేల చరిత్రలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాదు నుంచి ముంబై బయలుదేరిన ఏపీ దురంతో ఎక్స్ ప్రెస్ కర్ణాటకలోని మార్టూరు వద్ద పట్టాలు తప్పింది. రాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరో వ్యక్తి చనిపోయారు. ప్రమాదంలో మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ బోగీల్లో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. ప్రమాదంపై సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు వేగంగా స్పందించారు. సమీపంలోని గుంతకల్ నుంచి సహాయక సిబ్బంది ప్రత్యేక రైలులో ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో సిికింద్రాబాదు-ముంబై మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.