: బావ గల్లాను పరామర్శించిన మహేశ్ బాబు
ఆగస్టు 30న కుమారుడికి బైక్ కొంటూ టెస్ట్ రైడ్ కు వెళ్లిన గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ గాయపడిన సంగతి తెలిసిందే. గుంటూరు ఆసుపత్రిలో కోలుకున్న ఆయన తన నివాసానికి చేరుకున్నారు. దీంతో గల్లా జయదేవ్ ను పరామర్శించేందుకు సినీ నటుడు మహేశ్ బాబు ఆయన ఇంటికెళ్లారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నడవగలుగుతున్నానని, మరేం ప్రమాదం లేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా గల్లా కుటుంబంతో మహేశ్ బాబు దిగిన ఫోటోను గల్లా జయదేవ్ సోషల్ మీడియాలో పెట్టారు. కాగా, మహేశ్ బాబుకు గల్లా జయదేవ్ బావ అవుతారన్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు సోదరిని జయదేవ్ వివాహం చేసుకున్నారు.