: నా తొలి సినిమా ఫెయిలయ్యే ఛాన్సే లేదు: కపిల్ శర్మ
తన తొలి సినిమా విఫలమయ్యే అవకాశం లేదనే విశ్వాసాన్ని కపిల్ శర్మ వ్యక్తం చేశాడు. కలర్స్ టీవీ చానెల్ లో శని, ఆది వారాల్లో ప్రసారమయ్యే కామెడీ నైట్స్ విత్ కపిల్ కార్యక్రమం ద్వారా దేశవిదేశాల్లోని భారతీయులకు, ముఖ్యంగా పంజాబీలకు దగ్గరైన కపిల్ బుల్లి తెర నుంచి వెండి తెరకు ప్రమోషన్ సంపాదించాడు. అబ్బాస్-మస్తాన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కిస్ కిస్కో ప్యార్ కరూ' సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు కపిల్ శర్మ. బాలీవుడ్ సినిమాల ప్రమోషన్ ద్వారా నటులను ఇంటర్వ్యూ చేసే కపిల్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజా సినిమాలో నలుగురు భామలతో ఆడిపాడనున్న కపిల్, బాలీవుడ్ లో బంగారు బాటపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా బాలీవుడ్ లో తన స్థానం సుస్థిరం చేస్తుందని కపిల్ అభిప్రాయపడ్డాడు.