: సవరణలు చేసిన తెలంగాణ నూతన మద్యం విధానం ఇదే...!


పాత మద్యం విధానానికి సవరణలు చేస్తూ రూపొందించిన నూతన మద్యం విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విధానంలో 20 శాతం లైసెన్సు రుసుం పెంచారు. 10 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో వైన్ షాపు కు 39 లక్షల రూపాయలుగా లైసెన్స్ రుసుం నిర్ణయించారు. 10 నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 40.80 లక్షల రూపాయలుగా ప్రకటించారు. 50 వేల నుంచి 3 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో 50.40 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. 3 నుంచి 5 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో 60 లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి 20 లక్షలు జనాభా ఉన్న ప్రాంతాల్లో 81.60 లక్షల రూపాయలుగా ప్రభుత్వం పేర్కొంది. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న చోట్ల కోటీ ఎనిమిది లక్షల రూపాయల రుసుముగా పేర్కొన్నారు. మద్యం దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితితో లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. 2015 అక్టోబర్ 1 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు రెండేళ్ల కాలపరిమితితో లైసెన్సులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News