: పబ్లిక్ డొమైన్ లో నేతాజీ ఫైల్స్ : సీఎం మమతా బెనర్జీ
స్వాతంత్ర్య పోరాటయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని ఫైళ్లను పబ్లిక్ డొమైన్ లో ఉంచుతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. పశ్చిమబెంగాల్ సెక్రటేరియట్ లో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం వద్ద నేతాజీకి సంబంధించి ఉన్న మొత్తం ఫైళ్లను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయంలో, హోం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలో ఉన్న కొంతమంది బ్యూరోక్రాట్లపై మమతా బెనర్జీ పలు విమర్శలు చేశారు.