: ఐఐటీ బీటెక్ లో డ్యాన్స్ కోర్సు!


దేశంలో మొట్టమొదటిసారిగా బీటెక్ లో డ్యాన్స్ ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన ఘనత భువనేశ్వర్ ఐఐటీ దక్కించుకుంది. ఒడిస్సీ నృత్యాన్ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెడుతున్నట్లు డైరైక్టర్ ఆర్.వి.రాజకుమార్ శుక్ర వారంనాడు తెలిపారు. నాలుగు సంవత్సరాలపాటు చదివే బీటెక్ కోర్సులో ఒడిస్సీ సంప్రదాయక నృత్యంపై తరగతులు ఉంటాయన్నారు. వారానికో 5 గంటల చొప్పున తరగతులు ఉంటాయని చెప్పారు. బీటెక్ మొదటి సంవత్సరంలో అంటే మొదటి, రెండు సెమిస్టర్లలో ఈ నృత్యాన్ని ఎక్స్ ట్రా అకడమిక్ యాక్టివిటీగా విద్యార్థులు నేర్చుకోవచ్చన్నారు. రెండు,మూడు సంవత్సరాల కోర్సులో ఎలక్టివ్ సబ్జెక్టులుగా ఒడిస్సీ, ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్ షిప్స్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు పది మంది విద్యార్థినులు ఈ నృత్యాన్ని ప్రధానాంశంగా తీసుకున్నారన్నారు. బీటెక్ డిగ్రీతో పాటుగా దీనిని పూర్తి చేయాల్సి ఉంటుందని రాజకుమార్ చెప్పారు.

  • Loading...

More Telugu News