: ‘అనంత’లో లాకప్ డెత్... విచారణకు తీసుకొచ్చిన వ్యక్తి లాకప్ లోనే మృతి


అనంతపురం జిల్లాలో లాకప్ డెత్ చోటుచేసుకుంది. జిల్లాలోని చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం వెలుగు చూసిన ఈ ఘటనలో విచారణ కోసం పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చిన ఓ యువకుడు లాకప్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. వివరాల్లోకెళితే... చెన్నేకొత్తపల్లి మండలం గువ్వలగంధంపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు అనే యువకుడిని ఓ కేసు విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. ఈ క్రమంలో అతడు పోలీస్ స్టేషన్ లోనే చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసులు కొట్టడం వల్లే శ్రీరాములు చనిపోయాడని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటిదాకా పోలీసులు నోరు మెదపలేదు.

  • Loading...

More Telugu News