: 'వ్యాపం' దర్యాప్తును మూడు వారాల్లోగా చేపట్టండి... సీబీఐకి సుప్రీం ఆదేశాలు
వ్యాపం కుంభకోణం కేసులో దర్యాప్తుపై సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మూడు వారాల్లోగా దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లో ఈ స్కాంపై వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న 72 కేసులను తమ అధీనంలోకి తీసుకోవాలని సూచించింది. అంతేగాక ఈ కేసులను వాదించేందుకు 48 మంది ప్రభుత్వ న్యాయవాదులను నియమించేందుకు సీబీఐకి సుప్రీం అనుమతించింది. ట్రయల్ కోర్టుల్లో సీబీఐకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కాంలో నలభైమందికి పైగా అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.