: టీడీపీ కేడర్ బేస్డ్ పార్టీ: పయ్యావుల కేశవ్
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. తిరుపతిలో పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన రాజకీయ శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థాగతంగా అత్యంత పటిష్ఠ పునాదులు కలిగి ఉన్న అతి కొద్ది పార్టీల్లో టీడీపీ మొదటి స్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. వామపక్షాలకు కూడా సాధ్యం కాని రీతిలో టీడీపీ వ్యవస్థీకృతంగా నిర్మితమైందన్నారు. అంతేకాక కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే పార్టీగా ఎదిగిన టీడీపీ ముమ్మాటికీ కేడర్ బేస్డ్ పార్టీనేనని ఆయన వ్యాఖ్యానించారు.