: పాక్ పై భారత్ ఎన్నడూ తొలి బుల్లెట్ కాల్చలేదు: రాజ్ నాథ్ సింగ్
సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైన్యం ఇప్పటి వరకు ఏనాడూ పాకిస్థాన్ సైన్యంపైకి తొలి బుల్లెట్ కాల్చలేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. భవిష్యత్తులో కూడా భారత్ ఇదే విధానాన్ని అవలంబిస్తుందని అన్నారు. గతంలో కూడా పాకిస్థాన్ కవ్వింపులకు దిగిన తర్వాతనే భారత్ స్పందించిందని తెలిపారు. ఢిల్లీలో సరిహద్దు విభాగానికి చెందిన ఉన్నతాధికారుల సమావేశానికి హాజరైన రాజ్ నాథ్... పాక్ సైన్యం చర్యల పట్ల ముక్కుసూటిగా స్పందించారు. ఇదే సమయంలో, ఉగ్రవాదులకు సంబంధించి కూడా పలు సూచనలను పాక్ సైనికాధికారులకు ఇచ్చారు. పాక్ గడ్డ నుంచి ఒక్క ఉగ్రవాది కూడా భారత్ లో చొరబడకుండా చూడాల్సిన బాధ్యత పాకిస్థాన్ సైన్యానిదే అని చెప్పారు.