: ఏపీ ప్రభుత్వ దృష్టి అంతా రాజధాని మీదే ఉంది... ఇలాగైతే, సమతుల్యం దెబ్బతింటుంది: బీవీ రాఘవులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి అంతా రాజధాని మీదే ఉందని... ఇదే విధంగా ముందుకు సాగితే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు దెబ్బతినే అవకాశం ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఇచ్చిన వినతిపత్రంలో వివిధ ప్రాంతాల సమస్యల కన్నా, రాజధానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉండటం కలవరపెట్టే అంశమని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పరిశ్రమల గురించే వినతి పత్రంలో ఉందని... రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల గురించి పెద్దగా ప్రస్తావన లేదని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రాంతాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని తెలిపారు. రాజధాని నిర్మాణం ఎంత ముఖ్యమో, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News