: కశ్యప్ ఓడిపోయాడు... జపాన్ ఓపెన్ లో ముగిసిన భారత పోరు


జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరు ముగిసింది. ఈ టోర్నీలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత షట్లర్ సైనా నెహ్వాల్ నిన్ననే ఓడిపోయి ఇంటి బాట పట్టింది. ఇక ఈ టోర్నీలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న తెలుగు కుర్రాడు పారుపల్లి కశ్యప్ కూడా కొద్దిసేపటి క్రితం ముగిసిన మ్యాచ్ లో పరాజయం పాలయ్యాడు. చైనా క్రీడాకారుడు చే తియన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 14-21, 18-21 స్కోరుతో ఓడిపోయాడు. దీంతో ఈ టోర్నీలో భారత పోరు ముగిసినట్లైంది.

  • Loading...

More Telugu News