: స్విమ్స్ వైద్యవిద్య ప్రవేశాల్లో జోనల్ విధానం పాటించాలి: బీవీ రాఘవులు


తిరుపతి స్విమ్స్ వైద్య విద్య ప్రవేశాల్లో జోనల్ విధానం పాటించాలని సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. రాయలసీమ విద్యార్థులకు ఇప్పటికే ఈ ప్రవేశాల్లో అన్యాయం జరిగిందని, కేవలం వారికి 16 శాతం సీట్లు మాత్రమే లభించాయని చెప్పారు. అనంతపురంలో ఈ రోజు పలు సమస్యలపై సీపీఎం పార్టీ తలపెట్టిన సామూహిక సత్యాగ్రహంలో పాల్గొన్న రాఘవులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్రానికి సమర్పించిన నివేదికలో రాజధానికి మేలు జరుగుతుందనే విషయాన్ని ప్రస్తావించారని, రాయలసీమ ప్రయోజనాలను మరచిపోయారని ఆరోపించారు. పట్టిసీమతో రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. కేవలం ఇది రాజధాని ప్రాంత నీటి అవసరాల కోసమేనని రాఘవులు ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టులో రూ.1200 కోట్ల దోపిడి జరిగిందని విమర్శించారు. రైతులపై సీఎం చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే కనుక పట్టిసీమ జీవోలో సీమ ప్రస్తావన ఉండేదని, కానీ అలా లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా మంచిదో లేక ప్రత్యేక ప్యాకేజీ మంచిదో చంద్రబాబు వివరించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News