: ఏపీలో మరిన్ని గ్రామాలను దత్తత తీసుకునేందుకు టాటా ట్రస్ట్ సుముఖం


ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు టాటా ట్రస్ట్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరిన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు టాటా ట్రస్ట్ ముందుకొచ్చినట్టు ఎంపీ శ్రీరాం మల్యాద్రి తెలిపారు. ట్రస్ట్ ద్వారా గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 400 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. బాపట్లలోని రామకృష్ణపురంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్ల నియోజకవర్గం భవిష్యత్తులో ఊహించలేనంత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం పేరలి గ్రామాన్ని టాటా ట్రస్ట్ దత్తత తీసుకొందన్నారు. మరిన్ని గ్రామాలను దత్తత తీసుకోవడానికి ట్రస్ట్ సీఈవో సుముఖత వ్యక్తం చేసినట్టు మల్యాద్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News