: ‘కేశవరెడ్డి’ అక్రమాల చిట్టాపై దర్యాప్తు షురూ... కర్నూలు క్యాంపస్ లో పోలీసుల తనిఖీలు


డిపాజిట్లతో పిల్లలకు ఉచితంగానే విద్యనందిస్తామంటూ కేశవరెడ్డి విద్యా సంస్థల యాజమాన్యం ప్రవేశపెట్టిన నయా దందాపై పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. దాదాపు 11,000 మంది పిల్లల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల మేర డిపాజిట్లు సేకరించిన విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి, గడువు ముగిసినా డిపాజిట్ సొమ్ము చెల్లించడంలో విఫలమయ్యారు. అంతేకాక బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల చెల్లింపులోనూ ఆయన చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో మొన్న రాత్రి కేశవరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో ఆయనను రిమాండ్ కు తరలించిన పోలీసులు, ఆ తర్వాత అక్రమాల చిట్టాపై దృష్టి సారించారు. నేటి ఉదయం కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఉన్న పాఠశాల క్యాంపస్ కు చేరుకున్న పోలీసులు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే, డిపాజిటర్లతో పాటు బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తులకు కేశవరెడ్డి రూ.570 కోట్ల మేర బకాయి పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

  • Loading...

More Telugu News